Open Plots in Amaravati

Month: November 2024

AP Budget: Major Boost for Amaravati Development

AP Budget: అమరావతీ ఊపిరి పీల్చుకో…


నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యం బడ్జెట్లో రూ.3,445 కోట్లు కేటాయింపు


Amaravati’s Future Brightens with Doubled Funding:
వైఎస్సార్సీపీ సర్కారు విధ్వంసక విధానాల వల్ల నిలిచిన రాజధాని నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో అమరావతికి రూ.3,445.33 కోట్లు కేటాయించింది. ప్రధాన మౌలిక వసతులకు రూ.3,000 కోట్లు నిధులను సమకూర్చింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులకు రూ.400 కోట్లు, అమరావతి స్మార్ట్‌సిటీస్‌ కార్యక్రమంలో భాగంగా సిటీస్‌ ఛాలెంజ్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు రూ.32 కోట్లు, హైకోర్టు భవనంలో వసతుల కల్పనకు రూ.13.33 కోట్లును వెచ్చించనుంది.

రాజధానికి నిధులు: ఐదేళ్ల అనంతరం మళ్లీ బడ్జెట్‌లో అమరావతి ప్రస్తావన ప్రముఖంగా కనిపించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా కొలిక్కి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేయడంతో రాజధాని పనులు పరుగులు పెట్టబోతున్నాయి. రాజధానికి సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసానివ్వడం, ప్రపంచబ్యాంకు (World Bank), ఏడీబీల (ADB) నుంచి రూ.15,000 కోట్ల రుణ ప్రక్రియ కొలిక్కి రావడం, రూ.12,000 కోట్లు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడంతో ఆర్థిక వనరుల లోటు తొలగిపోయింది.

ఇక నాలుగు నెలలే సమయం: రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు (World Bank), ఏడీబీ (ADB- Asian Development Bank) కలిసి రూ.15,000 కోట్ల రుణం ఇస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే నిధుల్ని సీఆర్‌డీఏకు (CRDA) విడుదల చేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక హెడ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం (నవంబర్​ 10న) ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రతిపాదన ఆధారంగా హెడ్‌ కిందే వార్షిక బడ్జెట్‌లో రూ.3,000 కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక నాలుగు నెలలే మిగిలి ఉంది.

 

జనవరి ఆఖరులోగా టెండర్లు: రాజధాని పనుల్ని ప్రారంభించేందుకు ప్రస్తుతానికి ఆ నిధులు సరిపోతాయని ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అమరావతిలో ప్రధాన రహదారులు, వరద నివారణ కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, యుటిలిటీ డక్ట్​లు, రైతులకు స్థలాలు కేటాయించిన లే అవుట్‌ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటి పనులకు సీఆర్‌డీఏ (CRDA) సుమారు రూ.50,000 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. జనవరి ఆఖరులోగా టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

రైతులకు ఊరట: అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలును సకాలంలో చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులకు పాత బకాయిలతో పాటు ఏటా క్రమం తప్పకుండా కౌలు చెల్లించేలా విధంగా చర్యలు తీసుకుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. వైఎస్సార్సీపీ సర్కారు పెట్టిన బకాయిలతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) కౌలునూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు చాలా వరకు చెల్లించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు (Smart City Project) కింద రాజధానిలోని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతులకు పనులకు రూ.32 కోట్లు కేటాయించడం వల్ల అత్యాధునికంగా నిర్మిస్తున్న అమరావతితో సమానంగా గ్రామాలూ అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది.

AP Capital Amaravati to Receive a Loan of Rs.15,000 Crore

రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణంపై నేడు సంతకాలు

దిల్లీలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనున్న సీఆర్డీఏ కమిషనర్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

  • ‘రాజధాని అమరావతి సమగ్ర సుస్థిర నగర అభివృద్ధి ప్రాజెక్టు’లో భాగంగా తొలిదశలో రూ.15వేల కోట్లతో చేపడుతున్న పనులకు ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలిసి సుమారు రూ.13,500 కోట్లు రుణంగా ఇస్తున్నాయి. మిగతా రూ.1,500 కోట్లను కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకోనుంది.
  • ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణం మంజూరు ప్రక్రియ చివరి దశకు చేరడంతో సీఆర్డీఏను ప్రాజెక్టు అమలు సంస్థగా నియమిస్తూ, రాష్ట్రప్రభుత్వం తరపున ఆ సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు సీఆర్డీఏ కమిషనరు అధికారాలిస్తూ జీఓ ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో సోమ, మంగళవారాల్లో రుణ ఒప్పందంపై కమిషనర్ సంతకాలు చేయనున్నారు.
  • నిధుల వినియోగానికి బడ్జెట్లో ప్రత్యేక హెడ్ ఆఫ్ ఎకౌంట్ను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రాజధానిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల్ని సీఆర్డీఏకి ప్రత్యేక ఖాతాలో జమచేస్తారు.

అత్యంత వేగంగా రుణం మంజూరు
అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి అత్యంత వేగంగా రుణం మంజూరైంది. రాజధానికి రూ.15,000 కోట్ల ఆర్థికసాయం కావాలని సీఆర్డీఏ ఈ ఏడాది ఆగస్టు 22న కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదన పంపింది. అమరావతికి చెరో రూ.6,750 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ రెండు సంస్థలూ అంగీకారం తెలిపాయని సెప్టెంబరు 11న ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖ నుంచి వర్తమానం అందింది. అక్కడి నుంచి ప్రంపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో కేంద్ర ఆర్థికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారుల చర్చలు, సంప్రదింపులు శరవేగంగా జరిగాయి. ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్, రిజల్ట్ బేస్డ్ లెండింగ్ విధానాల కింద ఆ రెండు బ్యాంకులూ రుణం ఇస్తున్నాయి.

చేపట్టే కార్యక్రమాలు ఇవే..

రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా… ప్రధాన రహదారులు, యుటిలిటీ డక్ట్ నిర్మాణం, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, వరద నివారణకు రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్ట్ స్కీమ్లు, రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, శుద్ధి వ్యవస్థల నిర్మాణం, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, నివాస గృహాల నిర్మాణం చేపడతారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నంచి వచ్చే నిధుల్ని వీటికి వినియోగిస్తారు.

AP Capital Amaravati to Receive a Loan of Rs.15,000 Crore

CRDA Commissioner to Sign an Agreement with ADB and World Bank in Delhi

  • As part of the ‘Comprehensive Sustainable Urban Development Project’ of the capital Amaravati, the World Bank and ADB are jointly providing a loan of approximately Rs.13,500 crore for the works undertaken in the first phase with an outlay of Rs.15,000 crore. The remaining Rs.1,500 crore will be mobilized by the state government with the cooperation of the central government.

  • With the World Bank and ADB loan approval process reaching the final stage, the state government has issued a GO appointing CRDA as the implementing agency and authorizing the CRDA Commissioner to enter into an agreement with those institutions on behalf of the state government. Accordingly, the Commissioner will sign the loan agreement in Delhi on Monday and Tuesday.

  • The government has stated that a special head of account will be created in the budget for the utilization of funds. Bills related to the works undertaken in the capital will be deposited in a special account with the CRDA.

Loan Sanctioned at a Rapid Pace
The loan from the World Bank and ADB to Amaravati has been sanctioned at a very fast pace. On August 22 this year, CRDA sent a proposal to the central finance ministry seeking financial assistance of Rs.15,000 crore for the capital. On September 11, the central finance ministry informed the government that both institutions had agreed to provide a loan of Rs.6,750 crore each to Amaravati. From there, discussions and consultations between the World Bank, ADB representatives, the central finance ministry, the state government, and CRDA officials took place at a rapid pace. Both banks are providing loans under the Program for Results and Results-Based Lending policies.

Programs to be Undertaken
As part of the capital development project… construction of major roads, utility ducts, storm water drains, reservoirs for flood prevention, canals, lift schemes, development of LPS layouts where lands were allotted to farmers, drinking water supply, sewerage and purification systems, legislative assembly, high court, secretariat, departmental office buildings, and residential buildings will be undertaken. The funds from the World Bank and ADB will be used for these.

Summary

The Andhra Pradesh government has secured a significant loan of Rs.15,000 crore from the World Bank and ADB for the development of the new capital city, Amaravati. This funding will be used to construct various infrastructure projects, including roads, drainage systems, and government buildings. The rapid approval of this loan highlights the government’s commitment to developing Amaravati into a world-class capital city.

Contact Us
Get a Free Consultation.Find out what your plot is really worth!
Scroll to top